అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది కాజల్

51

ఓ హీరోయిన్ 30వ పడిలోకి వచ్చిందంటే.. ఆమె గ్లామర్ తేడా కొట్టేస్తుంది. అవకాశాలు తగ్గుముఖం పట్టేస్తాయి. కానీ కొందరు మాత్రం ఆ వయసులోనూ గ్లామర్ కాపాడుకుంటారు. మంచి మంచి అవకాశాలూ అందుకుంటారు. అందుకు కాజల్ అగర్వాల్ ఓ ఉదాహరణ. దశాబ్దం పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇంకా తన ప్రత్యేకతను చాటుకుంటోంది చందమామ. తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో కాజల్ ఎంత అందంగా కనిపిస్తోందో ఇప్పటికే కొన్ని పోస్టర్లలో చూశాం.

ఇప్పుడు లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్లో చందమామ మరింతగా మెప్పిస్తోంది. చూపు తిప్పుకోనివ్వని అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది కాజల్. మోడర్న్ డ్రెస్సుల్లో ఎంతగా కిక్కెక్కిస్తుందో.. సంప్రదాయ దుస్తుల్లో అంతగా ఆహ్లాదం పంచుతూ తనకు తానే సాటి అని రుజువు చేసుకుంటోంది కాజల్. తెలుగులో తన తొలి సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ చేసిన తేజతోనే కాజల్ ‘నేనే రాజు నేనే మంత్రి’ చేస్తుండటం విశేషం. అప్పటికి.. ఇప్పటికి కాజల్ లో వచ్చిన మార్పు చూస్తే షాకవ్వాల్సిందే. ఆగస్టు 11న ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ చిత్రం చందమామకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.