ఆ రైలు హైదరాబాద్ నుండి అమరావతి కి గంట లోపు తీసుకెళ్తుంది !

52

హైదరాబాద్ నుండి అమరావతి కి గంట లోపా? విమానం లో కూడా సాధ్యం కాదు కదా అనుకుంటున్నారా? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆలోచనలో ఉన్నారు. అమెరికా కు చెందిన హైపర్ లూప్ అనే సంస్ధ అతి వేగవంతమైన ఈ రవాణా వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశ పెట్టడానికి ప్రతిపాదన చేసింది. ముఖ్యమంత్రికి డెమో కూడా ఇచ్చారు.

 

రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాకుండా ఎం.ఓ.యు సంతకం చేసుకోడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. హైపర్ లూప్ రవాణా వ్యవస్ధ అందుబాటులోకి వస్తే అమరావతి నుండి విశాఖపట్నం కేవలం 25 నిముషాల్లో ప్రయాణించొచ్చట. ఈ వ్యవస్థ కోసం ఎత్తైన పిల్లర్స్ పైన వాక్యూమ్ ట్యూబ్ అమరుస్తారు. క్యాప్సూల్స్ తరహాలో ఉండే కోచ్ ట్యూబ్ లో తేలుతూ ప్రయాణిస్తుంది. గాలి వాళ్ళ కానీ మరే విధమైన సంఘర్షణ లేకపోవడం వల్ల ఈ క్యాప్సూల్స్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.