ఎయిర్‌హోస్టెస్ అలా చేస్తుండగా.. సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు!

31

విమానంలో ఎయిర్‌హోస్టెస్ చేసిన నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బార్సిలోనా నుంచి దుబాయ్ వెళుతున్న ఓ విమానంలో ఎయిర్‌హోస్టెస్.. గ్లాసుల్లో తాగగా మిగిలిపోయిన మద్యాన్ని బాటిళ్లలో నింపుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని రష్యాకు చెందిన ఎవ్‌జినీ కెమోవ్ అనే ప్రయాణికుడు అనుకోకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో గిరాగిరా తిరుగుతూ.. అందరికీ భలే కిక్కిస్తోంది.

ఎమిరేట్ ఫ్లైట్లలో అందులోనూ బిజినెస్ క్లాస్‌లో అలాంటి పనులు చేయడం సిగ్గు చేటని, చూస్తుంటే ఆ విమానాల్లో అది సాధారణమే అయిపోయినట్లు తోస్తోందని కెమోవ్ పేర్కొన్నాడు. విమానంలోకి ప్రవేశిస్తుండగా సరదాగా కొన్ని దృశ్యాలను సెల్‌ఫోన్లో బంధించానని, వాస్తవానికి వీడియో చిత్రీకరించినప్పుడు ఆ ఎయిర్‌హోస్టెస్ చేస్తున్న పనిని గుర్తించలేదని అతడు చెప్పుకొచ్చాడు.