గౌతమ్ నంద రివ్యూ

72
తారాగణం: గోపీచంద్, హన్సిక, క్యాథెరిన్ ట్రెసా, సచిన్ ఖేద్కర్, చంద్ర మోహన్, సీత, నికితిన్ దీర్, ముకేశ్ రిషి, వెన్నెల కిషోర్
దర్శకత్వం: సంపత్ నంది
సంగీతం: ఎస్ ఎస్ థమన్
నిర్మాత: జె భగవాన్, జె పుల్ల రావు
కథ:
 గౌతమ్ ఘట్టమనేని (గోపీచంద్) భారత దేశంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ఒక్క గానొక్క కొడుకు. అతని దిన చర్య పబ్బుల్లో అమ్మాయిలతో తాగడం  ఖరీదైన కారుల్లో తిరగడం. ఒకానొక స్టేజి లో జీవితమంటే విరక్తి వస్తుంది. గౌతమ్ అతనికంటూ సొంత గుర్తింపు ఏమి లేదని తెలుసుకుంటాడు.  ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో అతని లగే ఉండే నందను కాలుస్తాడు. నంద ఓ పెద్ద కుటుంబానికి చెందిన వాడు. ఇద్దరూ నెల రోజుల పాటు ఒకరి జీవితాన్ని మరొకరు జీవించేలా ఒప్పందం చేసుకుంటారు. పేద తల్లితండ్రుల తో బస్తీలో ధనవంతుడైన గౌతమ్, విలాసవంతమైన భవనంలో వందమంది పనివాళ్ళతో కటిక ధరిద్రుడైన నంద ఏమి చేసారు, వారికీ ఎదురయ్యే సమస్యలేమిటో తెలుసుకోవాలంటే గౌతమ్ నంద చిత్రాన్ని తేరా మీద చూడండి.
రివ్యూ:
బ్లాక్ అండ్ వైట్ కలం నుండి తెలుగు వారి పరిచయమున్న రాజు – పేద డబల్ ఆక్షన్ కథే గౌతమ్ నంద. నేటి తరం వారికీ కావలిసిన కమర్షియల్ హంగులతో తెరకెక్కించాడు సంపత్ నంది. ప్రథమార్ధం గౌతమ్ రిచ్ లైఫ్ స్టైల్ ను చాల బాగా చూపించాడు. అదే విధంగా బస్తి లో నంద ఫ్రెండ్స్ తో చేసే చిలిపి చేష్టలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత చిత్రం ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామాతో బరువెక్కుతుంది. సెంటిమెంట్ ఎక్కువయి సాగతీత ల అనిపిస్తుంది. ద్వితీయార్ధం అవసరానికి మించి నిడివి ఉండటం వాళ్ళ బోరు కొడుతుంది.  ఫైట్ సీన్స్ సుదీర్ఘంగా ఉంది ఓపికకు పరీక్షా పెడతాయి.
అయితే కొన్ని ఊహించని మలుపులతో ఇంటరెస్ట్ క్రియేట్ చేసాడు సంపత్ నంది.  పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. గోపీచంద్ రెండు విభిన్నమయిన పాత్రల్లో తన సత్తా చాటాడు. ముఖ్యంగా నంద పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. హన్సిక బస్తీలో నివసించే అమ్మాయికి మరీ గ్లామర్ ఎక్కువయిందా అనిపించేట్టు ఉంటుంది. క్యాథెరిన్ తన అందాల ఆరబోసింది. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి కామెడీ కితకితలు పెడతాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి పెద్ద హైలైట్. ఒకటి రెండు పాటలు కూడా బాగున్నాయి, సంపత్ నంది బాగా తీసాడు కూడా. మొత్తం మీద గౌతమ్ నంద రొటీన్ కమర్షియల్ చిత్రమే అయినా రిచ్ ప్రొడక్షన్ మరియు సాంకేతిక విలువలతో పర్వాలేదనిపిస్తుంది.
ప్లస్:
సరదాగా సాగె ప్రథమార్ధం
గోపీచంద్ నటన
పవర్ ఫుల్ డైలాగ్స్
థమన్ సంగీతం
మైనస్:
ద్వితీయార్ధం సాగతీత
క్లైమాక్స్