పటేల్ సర్ రివ్యూ

70

తారాగణం: జగపతి బాబు, పద్మప్రియ, ఆమని, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, కబీర్ దుహన్ సింగ్

దర్శకత్వం: వాసు పరిమి

ఛాయాగ్రహం: శ్యామ్ కె నాయుడు

నిర్మాత: కొర్రపాటి రంగనాథ సాయి

బ్యానర్: వారాహి చలన చిత్రం

కథ:

సుభాష్ పటేల్(జగపతి) ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. అతను దేశానికీ సేవ చేసే క్రమంలో కుటుంబానికి తక్కువ ప్రాధాన్యతనిస్తాడు. పటేల్ తన కొడుకైన వల్లభను కూడా ఆర్మీ లో చేరాలని పట్టుబడతాడు కానీ తండ్రికి వ్యతిరేకంగా అతడు ఫారిన్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని స్థిరపడతాడు.

తన తల్లి చావుబ్రతుకుల్లో ఉందని తెలిసి భార్య బిడ్డలతో తిరిగి వస్తాడు, ఆమె కోరిక మీద తండ్రితో కలిసిపోవాలని నిశ్చయించుకుంటాడు. అయితే అనుకోనివిధంగా ఓ మాఫియా ముఠా చేతిలో అందరూ దుర్మరణం పాలవుతారు. ఈ అఘాయిత్యానికి ఏకైక సాక్షియైన వల్లభ ఆరేళ్ళ పాపకు కళ్ళు పోతాయి.అరవయ్యేళ్లు పై బడిన పటేల్ పాపను చేరదీసి తన కొడుకు కుటుంబాన్ని హతమార్చిన దుండగుల వేటలో పడతాడు.

రివ్యూ

పటేల్ సర్ ఒక విభిన్నమైన రివెంజ్ డ్రామా, బలమైన ఎమోషన్స్, ఫామిలీ సెంటిమెంట్ ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. అయితే స్క్రీన్ప్లే అంత పకడ్బందీ గా రాసుకోకపోవడం ఈ చిత్రానికి మైనస్.

ప్రథమార్ధం స్లో గా సాగుతుంది. పటేల్ పాత్రా కి సస్పెన్స్ ను ఆపాదించే నేపద్యంలో అసలు కథను పక్కన పెట్టాడనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథనం ఊపందుకుంటుంది. ద్వితీయార్ధం మలుపులతో ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. జగపతి బాబు అరవైఏళ్ల వృద్దుడి పాత్రలో తన హావ భావాలతో మెప్పిస్తాడు.

ఎమోషన్స్ పండించాడు. అయితే కొడుకు పాత్రా అంతగా నప్పలేదనే చెప్పాలి. పద్మప్రియతో ఆయన రొమాంటిక్ ట్రాక్ మరియు సాంగ్ ఎబ్బెట్టుగా కనపడుతుంది. చిత్రీకరణ పరంగా సినిమాని చుట్టేసినట్టు ఉంటుంది. వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించవు. సంగీతంలోక్వాలిటీ లోపించింది, కెమెరా పనితనం కూడా పెద్దగా కనిపించదు. పోసాని కృష్ణ మురళి బలవంతపు కామెడీ, ఇతర సైడ్ క్యారెక్టర్లు బోర్ కొట్టిస్తారు.

విల్లన్లు గా కబీర్ దుహన్ సింగ్, కాలకేయ ప్రభాకర్, సుబ్బరాజు బాగా చేసారు. లేడీ పోలీసు అధికారి క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. చిన్న పాప చక్కగా నటించింది. మొత్తం మీద పటేల్ సర్ మంచి కథ ఉన్నా సాంకేతికంగా తెరకెక్కించడంలో లోపాలుండటం వాళ్ళ అంచనాలను అందుకోలేక పోవచ్చు.

బాగున్నవి:

కథాంశం

ద్వితీయార్ధం

పటేల్ సర్ క్యారక్టరు

బాగాలేనివి:

సాగదీసిన ప్రథమార్ధం

సంగీతం

జగపతి బాబు రొమాన్స్

చివరి మాట: మంచి కథ గతి తప్పింది