ఫిదా రివ్యూ

41

తారాగణం: సాయి పల్లవి, వరుణ్ తేజ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్ రాణే
దర్శకుడు: శేఖర్ కమ్ముల
సంగీతం: శక్తి కాంత్
నిర్మాత: దిల్ రాజు

కథ:

ఎన్.ఆర్.ఐ డాక్టర్ అయిన వరుణ్ తన అన్న పెళ్ళికి బాన్స్వాడ కు వస్తాడు. వదిన చెల్లి అయిన భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతి చలాకి గా ఉండే పిల్ల అయిన కుంచం మొండిది. తనకు పెళ్లి అయినా సరే తండ్రిని ఊరిని విడిచిపెట్టకూడదని భీష్మించుకుంటుంది. అయితే భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం ఉండటం వల్ల, అతనికి తన ప్రేమను తెలపాలనుకుంటుంది. కానీ వరుణ్ కి తన మార్ధలంటే ఇష్టమని, పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిర పడాలనుకుంటున్నాడని తెలిసి తన ప్రేమను బయటపెట్టదు.

వరుణ్ అన్న-వదినలతో అమెరికా వెళ్ళిపోతాడు. భానుమతి జ్ఞాపకాలు వెంటాడడటంతో ఆమె కు ఫోన్ చేసి ప్రేమ విషయం చెప్తాడు కానీ ఆమె తిరస్కరిస్తుంది. అంతేకాకుండా తండ్రి చూసిన సంభందానికి ఓకె చెప్తుంది. ఈ సందర్భంలో గర్భిణీ అయిన అక్కకు సహాయం చేయటానికి అమెరికా వస్తుంది భానుమతి. వరుణ్ ఆమెను ఒప్పించగలడా ? భానుమతి తండ్రిని – ఊరిని వదిలి అతనితో అమెరికాలో ఉండటానికి ఇష్టపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫిదా చూడాలిసిందే?

రివ్యూ

ఫిదా శేఖర్ కమ్ముల స్కూలు క్లాస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సున్నితమైన ఎమోషన్స్ భానుమతి పాత్రా చుట్టూ తిరుగుతుంది సినిమా. ఆమె ఒక సాధారణంగా కనపడే యువతే అయినా చాలా ఆత్మ విశ్వాసం గల గడుసైన పిల్ల. ఆమె చిత్రమైన బిహేవియర్, పంచ్ డైలాగులా తో ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. పల్లె వాతావరణం లో చిత్రీకరించడంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది.

సెకండ్ హాఫ్ చాలావరకు అమెరికాలో ఉండి ఎమోషనల్గానూ సెంటిమెంటల్గానూ ఉండి కుంచం బరువుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువయ్యి సాగతీసినట్లుంటుంది. మల్లి క్లైమాక్స్ మనసుకు హత్తుకునే విధంగా ఉండి ఒక మంచి అనుభూతినిస్తుంది.

పెర్ఫార్మన్స్ విషయానికొస్తే భానుమతి పాత్ర సాయి పల్లవి కోసమే రాసినట్టుంటుంది. సహజమయిన హావ భావాలతో పాత్రకు న్యాయం చేసింది. తెలంగాణ స్లాంగ్ డైలాగులు స్వచంగా పలకడంలో ఆమె కృషి అభినందనీయం. శేఖర్ కమ్ముల చిత్రాల్లో ఎన్ఆర్ ఐ హీరోల్లాగానే ఉంటూ ఖుషీలో పవన్ కళ్యాణ్ ను జ్ఞ్యాపకం చేస్తాడు వరుణ్ తేజ్.

సంగీతం బాగుంది, పల్లె లో తీసిన రెండు పాటలు స్టెప్పులేయిస్తాయి. పల్లె వాతావరణం చక్కగా చూపడంలో కెమరామెన్ పనితనం కనబడుతుంది.

ప్లస్

ఆహ్లాదకరమైన మొదటి భాగం
తెలంగాణ పల్లె వాతావరం
సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటన

మైనస్
ద్వితీయార్ధం సాగతీత
నిడివి

రివ్యూ : మస్తుగుంది