‘సాహో’ పై ప్రభాస్ క్లారిటీ

38

ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సాహో’ విశేషాలపై ప్రభాస్ మాట్లాడాడు.

‘‘బాహుబలితో పోలిస్తే ‘సాహో’ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా వర్తమానంలో నడుస్తుంది. ఐతే టీజర్ చూసి చాలామంది ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇది యాక్షన్ ప్రధానంగా సాగే హైటెక్ మూవీ. ఇందులోని యాక్షన్ ఘట్టాల్ని హాలీవుడ్ కొరియోగ్రాఫర్లు డిజైన్ చేస్తున్నారు. యాక్షన్ ద్వారా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాం. సుజీత్ చక్కటి స్క్రిప్టుతో వచ్చాడు.

‘బాహుబలి’ తర్వాత అదే స్థాయిలో ఎక్కడైనా రిలీజ్ చేయగలిగే యూనివర్శల్ సినిమా కోసం చూశాం. ‘సాహో’ అలాంటి సినిమానే. ఇది మరీ మోడర్న్ గా ఉంటుందని అనను. కానీ సినిమాను చాలా స్టైలిష్ గా.. ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దుతాం.’’ అని ప్రభాస్ చెప్పాడు. ‘సాహో’ సినిమాను యూరప్.. దుబాయ్.. అబుదాబి.. ముంబయి.. హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్ స్నేహితులైన వంశీ-ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బేనర్ మీద ‘సాహో’ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు-హిందీ-తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. మలయాళంలోకి కూడా అనువాదం కానుంది.