నిన్నుకోరి రివ్యూ

202

Cast & Crew:
• నటీనటులు: నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి, ప్రిద్వి రాజ్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ తదితరులు
• సంగీతం: గోపి సుందర్
• నిర్మాత: డి.వి.వి. దానయ్య ( డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్)
• దర్శకత్వం: శివ నారాయణ

Story:
నివేత “నాని” ని కలవడానికి వెళుతుండటంతో సినిమా మొదలవుతుంది. దారిలో తమ గతాన్ని గుర్తుతెచ్చుకుంటుతున్నారు ఇద్దరు. ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు లవర్స్. పీకల్లోతు ప్రేమలో మునిగిన ఇద్దరి మధ్య గొడవొచ్చి విడిపోతారు. కెరీర్ ముఖ్యమనుకొని నాని ఢిల్లీ కి వెళ్పోతాడు. కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేకపోతాడు. ఇంతలో నివేత ఆది ప్రేమలో పడుతుంది. ఆది కూడా నివేతను ప్రేమిస్తాడు. ట్విస్ట్ ఏంటి అంటే..నాని, ఆది ఫ్రెండ్స్. మరి చివరికి నివేత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఎవరు తమ ప్రేమను త్యాగం చేసారు? అసలు నాని-నివేత ఎందుకు విడిపోయారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే “నిన్ను కోరి” సినిమా చూడాల్సిందే!

Review:
వరస హిట్లతో దూసుకెళ్తున్న “నాని” కి మరో హిట్ లభించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదైలైన సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి. నాని సరికొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాలో. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. కథ పాతదే అయినా తీసిన విధానం కొత్తగా ఉంది. నివేత తన నటనతో మరోసారి కుర్రకారుల హృదయాలు దోచేసుకుంది. సాంగ్స్ విజువలైసింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ గా కంటతడి పెట్టించే అంతలోనే కామెడీ తో నవ్విస్తాడు డైరెక్టర్. పృద్వి రాజ్ కామెడీ అయితే హైలైట్. కాకపోతే మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అంత కనెక్ట్ అవ్వదు!

Plus Points:
• కథ సింపుల్ గా సాగిపోతుంది
• నాని – నివేత లవ్ ట్రాక్
• ఆది నటన
• సంగీతం
• పృద్వి రాజ్ కామెడి
• ఎమోషనల్ సన్నివేశాలు
• సినిమాటోగ్రఫీ

Minus Points:
• సినిమా ఎక్కడ బోర్ కొట్టాడు. మైనస్ అంటే చెప్పడం కష్టమే
• క్లాస్ సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్ కి అంత నచ్చకపోవచ్చు. (ఆక్షన్ సన్నివేశాలు లేవు)

Final Verdict:
లవ్, కామెడీ, ఎమోషన్స్ అన్ని కలిపిన క్లాస్ సినిమా “నిన్ను కోరి”.

Rating: 3.5/5